AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: పులులతో తారక్ ఎంట్రీకి విదేశీయులు ఫిదా.. ఆ షాట్ ఎప్పుడూ చూడలేదంటూ నెట్టింట రచ్చ..

ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఆర్ఆర్ఆర్ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.

RRR: పులులతో తారక్ ఎంట్రీకి విదేశీయులు ఫిదా.. ఆ షాట్ ఎప్పుడూ చూడలేదంటూ నెట్టింట రచ్చ..
Rrr
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2022 | 11:40 AM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఆర్ఆర్ఆర్ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈఏడాది భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ముఖ్యంగా చరణ్, తారక్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా పులులతో కలిసి బ్రిటిష్ వారిపై ఎన్టీఆర్ దాడి చేసే సన్నివేశంకు విదేశీయులు ఫిదా అయ్యారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. జక్కన దర్శకత్వం.. చరణ్, తారక్ నటన అద్భుతమంటూ పొగిడారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, నక్కలతో కలిసి తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీకి విదేశీయులు ఫిదా అయ్యారు.

ఇవి కూడా చదవండి
Rrr 1

Rrr 1

ఈ ఒక్క సీన్‏ను ఓ విదేశీయుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. కేవలం 48 గంటల్లో 11 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. “నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ ట్రక్‌ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు” తారక్ వైల్డ్ ఎంట్రీ చూసి థియేటర్లలో ప్రేక్షకులు నోరెళ్లపెట్టారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటిగా నలిచింది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు.

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?