David Warner: వార్నర్ మాములోడు కాదు భయ్యా.. రాబిన్ హుడ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..
ఇన్నాళ్లు క్రికెట్ స్టేడియంలో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేయగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు సినిమా టీంతో కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు వార్నర్. నితిన్, శ్రీలీల కలిసి పలు ఇంటర్వ్యూలలోనూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఈ సినిమాలో వార్నర్ కేవలం 2 నిమిషాల 50 సెకండ్స్ నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారు. కానీ ఇందుకోసం ఆయన ఏకంగా రూ.2.25 కోట్లు అంటే నిమిషానికి ఒక కోటి పారితోషికం తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
#DavidWarner Cameo in #Robinhood
Duration – 2 Min 50 SecondsRemuneration – 2.5 CroresShoot days – 2 days
One of the costly cameos in Indian Cinema, Took 1.25CR for each day pic.twitter.com/lzZadGhGmy
— Daily Culture (@DailyCultureYT) March 26, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..