AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janu Lyri: గలీజ్‌‌గా మాట్లాడుతున్నారు.. చచ్చిపోవాలనిపిస్తోంది.. వెక్కి వెక్కి ఏడ్చిన జాను

తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో జాను లిరి ఒకరు. ఈ క్రేజీ డాన్సర్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. తన డాన్స్ తో ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకుంది జాను. అయితే ఆమె పై కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తన పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది జాను.

Janu Lyri: గలీజ్‌‌గా మాట్లాడుతున్నారు.. చచ్చిపోవాలనిపిస్తోంది.. వెక్కి వెక్కి ఏడ్చిన జాను
Jaanulyri
Rajeev Rayala
|

Updated on: May 02, 2025 | 6:14 PM

Share

సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే.. ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది  పాపులర్ అయ్యారు. డాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాను షేక్ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాదు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో జానులిరి ఒకరు. ఫోక్స్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది జాను. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది.

అలాగే ప్రముఖ టీవీ ఛానెల్ లో డాన్స్ షోల్లో పాల్గొంది ప్రేక్షకులను మెప్పించింది. అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే.. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది.. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది జాను. అప్పటి నుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది. రోజు రోజుకు ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది. మంచి పొజిషన్ కు వెళ్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని తెలిపింది. అయితే కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. తన పై వస్తున్న విమర్శలు పై ఆమె స్పందించింది. ఓపిక నశించింది అంటూ బోరున ఏడ్చింది జాను.

“సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నా మాటలను ఎడిట్ చేసి గలీజ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలు నా కొడుకు చూడడా..? మీ వ్యూస్‌ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడుప్రతి అడ్డమైన వెదవ మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం అంటూ బోరున ఏడ్చింది జాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఏం చేసినా నన్ను విమర్శిస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నా కొడుకు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉంటే చూడాలని అనుకున్నా.. కానీ నేను అప్పటివరకు బ్రతకలేను అనిపిస్తుంది. మధ్యలోనే నేను చచ్చిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జాను లిరి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.