AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. సూర్యకు జోడిగా స్టార్ హీరోయిన్

సూర్య నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. గతంలో వచ్చిన కంగువ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య సినిమా చేశాడు. రెట్రో టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Suriya: అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. సూర్యకు జోడిగా స్టార్ హీరోయిన్
Suriya
Rajeev Rayala
|

Updated on: May 02, 2025 | 5:39 PM

Share

తమిళ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. తెలుగులో హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. ఇటీవలే ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు స్టార్ హీరో సూర్యతో కలిసి సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి. ఇప్పటికే ఈ సినిమా ఫిక్స్ అయ్యింది. సూర్య రీసెంట్ గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఇక ఇప్పుడు సూర్య, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులు ఇప్పటికే మొదలు పెట్టేశాడట్ వెంకీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. వెంకీ , సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే కీర్తిసురేష్ ను సంప్రదించారని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఇటీవలే నితిన్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ అనే సినిమాలోనూ కీర్తి హీరోయిన్ గా చేస్తుందని టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకుందని అంటున్నారు.

పెళ్లి తర్వాత కీర్తిసురేష్ సో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంది. అంతకు ముందు వరుసగా తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేసింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సూర్య సినిమాలో నటిస్తుందని అంటున్నారు. గతంలో సూర్య, కీర్తిసురేష్ కలిసి గ్యాంగ్ అనే సినిమా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.