AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier : అందమే కాదు ఈ అమ్మాయి గాత్రం అద్భుతమే.. ప్రియా ఎంత క్యూట్‏గా పాడిందో..

ముఖ్యంగా ఇందులోని కన్నకొట్టే సీన్ తో యూత్ ను ఇంప్రెస్ చేసింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడతాయి అనుకున్నారు అంతా.. కానీ అలా కాకుండా ఎప్పుడో ఒకసారి సినిమా చేస్తూ అడియన్స్ ముందుకు వస్తుంది. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చివరిసారిగా తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో చిత్రంలో నటించింది.

Priya Prakash Varrier : అందమే కాదు ఈ అమ్మాయి గాత్రం అద్భుతమే.. ప్రియా ఎంత క్యూట్‏గా పాడిందో..
Priya Prakash Varrier
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2024 | 9:16 AM

Share

దక్షిణాది నటీనటులు చాలా ప్రతిభావంతులు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్ ఎంత అందంగా ఉంటారో.. అదే విధంగా ఇతర కళలు కూడా నేర్చుకుంటారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకుంటారు. అలాగే పలు చిత్రాల్లో నటిగా కొనసాగుతునే మరోవైపు తమ మరో టాలెంట్ బయటకు తీస్తారు. కొందరు హీరోయిన్స్ ఇదివరకు తమ చిత్రాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హీరోయిన్స్.. మరో ప్రతిభతో జనాల హృదయాలను దొచేస్తారు. అలాంటి వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒరు అదార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ సెన్సెషన్ అయ్యింది. ముఖ్యంగా ఇందులోని కన్నకొట్టే సీన్ తో యూత్ ను ఇంప్రెస్ చేసింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడతాయి అనుకున్నారు అంతా.. కానీ అలా కాకుండా ఎప్పుడో ఒకసారి సినిమా చేస్తూ అడియన్స్ ముందుకు వస్తుంది. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చివరిసారిగా తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో చిత్రంలో నటించింది.

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ప్రియా మంచి సింగర్ అన్న సంగతి తెలిసిందే. గతంలోనూ కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఎంతో అందంగా ఆలపించింది. కళ్లు చెదిరేలా అందరి మనసులు గెలుచుకున్న ప్రియా వారియర్ తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియా కన్నడలో ఓ పాట పాడింది.

ఇవి కూడా చదవండి

కన్నడ సింగర్ సంజిత్ హెగ్డే ఆల్బమ్ సాంగ్ చేశారు. ఈ పాట నాకు చాలా బాగుంది. ఇది వైరల్‌గా కూడా మారింది. నాగార్జున శర్మ రాసిన ఈ పాటను సంజిత్ హెగ్డే పాడారు. ఈ పాటను ఇప్పుడు నటి ప్రియా వారియర్ ఎంతో అందంగా పాడింది. చాలా బాగా పాడిన ప్రియా వారియర్ ఇప్పుడు ఈ పాటతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియా అందమైన గాత్రానికి ముగ్దులవుతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.