PM Narendra Modi: ఆ విషయంలో ప్రధాని మోదీని మించిపోయిన ప్రభాస్ హీరోయిన్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా. ఆయనకు మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ అభిమానులు చేరుతారు. ఇక సోషల్ మీడియాలో మోదీకి మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా. ఆయనకు మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ అభిమానులు చేరుతారు. ఇక సోషల్ మీడియాలో మోదీకి మంచి క్రేజ్ ఉంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 91.3 మిలియన్ల మంది ప్రధాని మోడీని అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ప్రధాని మోడీని అధిగమించింది. తన సూపర్బ్ క్రేజ్ తో ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్ల విషయంలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ‘స్త్రీ 2’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుందీ అందాల తార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో శ్రద్ధా కపూర్ పాపులారిటీ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా పీక్స్ కు చేరుకుంది. శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమెను 91.4 మిలియన్ల (9.14 కోట్లు) మంది అనుసరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ప్రధాని నరేంద్ర మోడీ కంటే శ్రద్ధా కపూర్‌కే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల (9.13 కోట్లు) మంది అనుసరిస్తున్నారు.ఇప్పుడు ఆయనను అధిగమించి శ్రద్ధా కపూర్ మూడో స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ప్రియాంక చోప్రా, మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్ల మంది, విరాట్ కోహ్లీకి 270 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే మరో ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 85.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉంటే, దీపికా పదుకొణె ని 79.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా శ్రద్ధా కపూర్ గుర్తింపు పొందింది. ‘స్త్రీ 2’ సినిమా విజయం సాధించడంతో ఆమె అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.
వరుణ్ ధావన్ తో శ్రద్ధా కపూర్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ‘స్త్రీ 2’ సినిమా విడుదలైంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. 2018లో విడుదలైన ‘స్త్రీ సినిమాకు సీక్వెల్ ఇది. శ్రద్ధా కపూర్ తో పాటు రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది.
శ్రద్ధా కపూర్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.