AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ.. ఎందుకు అంత సైలెంట్.

Keerthy Suresh: డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ.. ఎందుకు అంత సైలెంట్.

Anil kumar poka
|

Updated on: Aug 22, 2024 | 9:32 AM

Share

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ అందాల తార మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ మెరుస్తున్నారు. అలా కీర్తి సురేశ్ నటించిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రఘు తాత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ అందాల తార మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ మెరుస్తున్నారు. అలా కీర్తి సురేశ్ నటించిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రఘు తాత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రైట‌ర్‌ సుమ‌న్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఆగస్టు15న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో కీర్తి సురేశ్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే రఘుతాత సినిమా తెలుగు వెర్షన్ డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ కానుందని న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక రఘుతాత డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌కు సంబంధించి మూవీ మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సెప్టెంబ‌ర్ మొదటి వారం లేదా సెప్టెంబర్‌ 14న రఘుతాత తెలుగు వర్షన్‌ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇక రఘు తాత సినిమా విషయానికి వస్తే.. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనల ఆధారంగా రఘుతాత సినిమాను నిర్మించారు. ముఖ్యంగా హిందీ భాషను వ్యతిరేకించే అమ్మాయి పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.