Dasara Movie: ‘దసరా’ మూవీ నుంచి క్రికెట్ వీడియో రిలీజ్.. సినిమాకే హైలెట్ అయిన సీన్..
ఇక ఓవైపు థియేటర్లలో ఈమూవీ విజయవంతగా రన్ అవుతుంటే.. మరోవైపు ఇంట్రెస్టింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి డిలిటేడ్ సీన్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తల్లి ముందు కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదన చెప్పుకున్న వెన్నెల వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది.

బాక్సాఫీస్ వద్ద దసరా సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇక న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వీరిద్దరు నటించిన సినిమాలకంటే ఈ మూవీలో వీరిద్దరి యాక్టింగ్ వేరేలెవల్. ముఖ్యంగా తెలంగాణ యాసలోనే అదరగొట్టేశారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పటివరకు నాని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగానే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఓవైపు థియేటర్లలో ఈమూవీ విజయవంతగా రన్ అవుతుంటే.. మరోవైపు ఇంట్రెస్టింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి డిలిటేడ్ సీన్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తల్లి ముందు కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదన చెప్పుకున్న వెన్నెల వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. తాజాగా ఈ మూవీలో హైలెట్ అయిన క్రికెట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంది. తన స్నేహితుడి కోసం విలన్ సమక్షంలో నాని ఈ క్రికెట్ లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తన టీమ్ ఓటమి చివరికి వెళ్లినప్పుడు నాని ఒక్కసారిగా చెలరేగిపోతాడు. థియేటర్లలో ఈ సీన్ మంచి కిక్ వచ్చేలా చేస్తుంది. అలాంటి క్రికెట్ గేమ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నానిలోని స్టైల్ ను ఆవిష్కరించిన తీరు విజల్స్ వేయిస్తుంది.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి , సాయి కుమార్, సముద్రఖని కీలకపాత్రలలో నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.