Comedian Ali : కూతురి వివాహానికి సీఎం జగన్ ఆహ్వానించిన అలీ దంపతులు
అలీ ఇంట త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. అలీ కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనుందన్న విషయం తెలిసిందే.

సినీ నటుడు అలీ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వైఎస్ ఆర్ సీపీ పార్టీలో కొనసాగుతున్నారు అలీ. ఈ మధ్యనే అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు సీఎం జగన్. ఇదిలా ఉంటే అలీ ఇంట త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. అలీ కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కూతురి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు అలీ. భార్యతో కలిసి తాడేపల్లి లో జగన్ ను కలిసి కూతురి విహ్వహానికి ఆహ్వానించారు అలీ. అదేవిధంగా తన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈసందర్భంగా అలీ మాట్లాడుతూ.. జగన్ ప్రజల మనిషి అని కొనియాడారు.
అలీ మాట్లాడుతూ.. ‘రాజకీయాలలో ఉన్నప్పుడు సహనం చాలా అవసరం. సహనాన్ని కోల్పోయి మాట్లాడితే ప్రజలే తిరగబడతారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అనుకోవటం కరెక్ట్ కాదు అన్నారు. జగన్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ఆయన ప్రజల మనిషి. ఈసారి ఎన్నికల్లో అన్ని సీట్లను జగన్ ప్రభుత్వం కచ్చితంగా సాధిస్తుంది. గతంలో జగన్ మీద నమ్మకంతోనే జనం 151 సీట్లు గెలిపించారు. ఈసారి 175 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఈ క్రమంలో నా వంతు పాత్ర పోషిస్తా.. ఇక నుంచి మరో అలీని చూస్తారు. సీఎం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తా.. ‘ అని అన్నారు అలీ.








