CM Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్.. జాతీయ అవార్డు విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధికి, ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సు విజేతలను సోమవారం (ఆగస్టు 19) సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఘనంగా సత్కరించారు.

భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హను మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హను మాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్ లను సన్మానించారు. కార్యక్రమంలో హను మాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జాతీయ అవార్డు విజేతలు..
Hyderabad to Become the Hub of Indian Cinema: HCM Revanth Reddy
ఇవి కూడా చదవండి– Felicitation of National Film Awards Winners
Honourable Chief Minister Sri A. @revanth_anumula stated that Hyderabad should be established as the hub of Indian film production. He assured that the government… pic.twitter.com/Nx0t0gevz6
— Jacob Ross (@JacobBhoompag) August 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




