AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని నా కోరిక.. మెగాస్టార్ కామెంట్స్

టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు వెంకటేష్, మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర సహా పలువురు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..

Chiranjeevi : బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని నా కోరిక.. మెగాస్టార్ కామెంట్స్
Chiranjeevi, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2024 | 8:49 AM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కు చాలా మంది సెల్బ్రెటీలు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు వెంకటేష్, మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర సహా పలువురు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆయన ఈ ఈవెంట్ లో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఇంద్ర సినిమా బాలకృష్ణ సినిమానే ఆదర్శం అని అన్నారు చిరంజీవి.

బాలయ్య 50 సంవత్సరాల వేడుకకు రావడం చాలా ఆనందంగా అన్నారు చిరు. అలాగే ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రాని కే ఒక వేడుకలా అనిపిస్తుంది. ఈ అరుదైన రికార్డు బాలకృష్ణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నందమూరి తారకరామారావు గారిని తెలుగు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా తండ్రి చేసిన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది మాములు విషయం కాదు. నిజంగా గ్రేట్.

అలాగే ఇంద్ర చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి అని అన్నారు చిరంజీవి. నాకు బాలకృష్ణతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని కోరిక ఉంది. మాములుగా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. మా మధ్య ఎలాంటి బంధం ఉందో ఫ్యాన్స్ కు తెలియడానికి ఇలా కొన్ని వేడుకలు చేసుకునే వాళ్ళం అన్నారు చిరు. నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే బాలయ్య రాకుండా ఉండరు. అలాగే మా ఇంట్లో జరిగే ఈవెంట్ల‌కు వచ్చి తమతో కలిసి డ్యాన్స్ కూడా వేస్తారని చిరు అన్నారు. బాలయ్య రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్..భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.