Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: పెళ్లి పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పెళ్ళికొడుకు పారిపోయాడంటూ..

ఇప్పటికే ఈ చిన్నదనికి 38 ఏళ్లు. 'ఆప్ కీ అదాలత్' కొత్త ఎపిసోడ్‌లో కంగనాను పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.  కోర్టు కేసులు తన పెళ్లికి ఆటంకంగా మారాయని చెప్పుకొచ్చింది కంగనారనౌత్. అలాగే  కంగనా రనౌత్  ఓ ఆశ్చర్యకరమైన సంఘటనను గుర్తు చేసుకుంది.

Kangana Ranaut: పెళ్లి పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పెళ్ళికొడుకు పారిపోయాడంటూ..
Kangana Ranaut
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2024 | 7:29 AM

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవలే రాజకీయాల్లోకి ఆగడు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. సినీరంగంలో రాణిస్తూ రాజకీయాల్లోనూ సత్తా చాటారు కంగనా. అయితే కంగనా పెళ్లి ఎప్పుడు అనేది అభిమానుల మదిలో మెదులుతోంది. ఇప్పటికే ఈ చిన్నదనికి 38 ఏళ్లు. ‘ఆప్ కీ అదాలత్’ కొత్త ఎపిసోడ్‌లో కంగనాను పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.  కోర్టు కేసులు తన పెళ్లికి ఆటంకంగా మారాయని చెప్పుకొచ్చింది కంగనారనౌత్. అలాగే  కంగనా రనౌత్  ఓ ఆశ్చర్యకరమైన సంఘటనను గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ..

‘పెళ్లి గురించి నేనేం చెప్పగలను.? పెళ్లి విషయంలో నాకు మంచి అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరికి భాగస్వామి కావాలి. పిల్లలు కూడా ఉండాలి. ప్రజలు నన్ను ఎంతగానో దూషించారు, నేను పెళ్లి చేసుకోలేకపోయాను. నా పెళ్లి చర్చలు ఎవరితో జరిగినా కోర్టు కేసులు వస్తాయని కంగనా చెప్పుకొచ్చింది. అలాగే మరో ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది.

‘పోలీసులు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఒకసారి మా ఇంట్లో మగపెళ్లి తరపు వారు ఉన్నప్పుడు నాకు కోర్టు సమన్లు ​​వచ్చాయి. అది చూసి ఆ వ్యక్తి  పరుగులు తీశాడు అని కంగనా రనౌత్ అన్నారు. అయితే కంగన వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సమస్య ఎదురైంది. ఈ చిత్రానికి కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించారు.ఈ మూవీలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపిస్తుంది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ వంటి నటీనటులు నటించారు. సినిమా విడుదలైన తర్వాత కొన్ని వివాదాలు సృష్టించే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.