అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకకు ఇంటికి వస్తున్న కమల్ ద్యాని, ఢిల్లీ జలమండలి తవ్విన 15 అడుగుల లోతైన గుంతలో పడి మరణించాడు. కనీస రక్షణ చర్యలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఆనందంతో మొదలవ్వాల్సిన వేడుక తీరని విషాదంగా మారింది. అధికారులు సస్పెండ్ చేయబడినప్పటికీ, ఒక నిర్లక్ష్యం ఒక మధ్యతరగతి కుటుంబ ఆశలను చిదిమేసింది.
ఇంట్లో అమ్మానాన్నల పెళ్లిరోజు వేడుకకు అన్నీ సిద్దం చేస్తున్నారు. త్వరగా ఇంటికి వెళ్లాలని ఆఫీసు పని తొందరగా ముగించుకుని.. అమ్మకు ఫోన్ చేశాడు.. అమ్మా.. చపాతీలు రెడీ చెయ్.. పావుగంటలో వచ్చేస్తా.. అన్నాడు.. ఎన్ని పావుగంటలు గడిచినా కొడుకు జాడలేడు.. పావుగంటలు గంటలుగా మారాయి.. తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఆనందం వెల్లివిరియాల్సిన ఆ ఇంట చివిరికి తీరని విషాదం నిండిపోయింది. తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుక కోసం టేబుల్‌పై అందంగా అలంకరించిన కేక్, సిద్ధంగా ఉన్న కొవ్వొత్తులు.. మరో పదిహేను నిమిషాల్లో కొడుకు రాగానే వేడుక మొదలుపెట్టాలని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. సరిగ్గా అర్ధరాత్రి 12:50 గంటలకు ఫోన్ చేసిన కమల్ ధ్యాని , “అమ్మా! చపాతీలు సిద్ధం చెయ్, వచ్చేస్తున్నాను” అని చెప్పాడు. కానీ, ఆ పదిహేను నిమిషాలు కాస్తా నిరంతర నిరీక్షణగా మారిపోయింది. నిర్లక్ష్యపు గోతిలో నిండు ప్రాణం బలైపోయింది. ఢిల్లీలోని జనక్‌పురి వద్ద ‘ఢిల్లీ జలమండలి’ తవ్విన 15 అడుగుల లోతైన గుంత ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. సీవరేజీ పనుల కోసం రహదారిని తవ్విన అధికారులు, కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడం శాపంగా మారింది. అటు బారికేడ్లు లేవు, ఇటు హెచ్చరిక బోర్డులు లేవు. కనీసం ఆ ప్రాంతంలో వీధి దీపాలు కూడా లేక చీకటిగా ఉండటంతో, బైక్‌పై వస్తున్న కమల్ ఆ మృత్యుపాశాన్ని గమనించలేకపోయాడు. తన కష్టార్జితంతో కొనుక్కున్న బైకే అతడికి చివరి ప్రయాణ సాధనమైంది. కాల్ సెంటర్ ఉద్యోగి అయిన కమల్ ఎంతకీ రాకపోవడంతో ఆ తండ్రి, సోదరుడు తెల్లవార్లూ గాలించారు. చివరకు ఉదయాన్నే ఆ గుంతలో విగతజీవిగా పడి ఉన్న కమల్‌ను చూసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. సంతోషంతో నిండాల్సిన పెళ్లి రోజు, కొడుకు శవానికి తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తెచ్చింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేసినప్పటికీ, ఆ తల్లిదండ్రులకు జరిగిన తీరని లోటును ఏ చర్య భర్తీ చేయగలదు? అధికారుల చిన్న నిర్లక్ష్యం ఒక మధ్యతరగతి ఇంటి ఆశలను చిదిమేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు

