Godfather: మెగాస్టార్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ముందు ఆ హీరోను అనుకున్నారట..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటేస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటేస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సల్మాన్ తోపాటు లేడీ సూపర్ స్టార్ నయన తార సినిమా లో మెగాస్టార్ సిస్టర్ పాత్రలో కనిపించనుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ సాంగ్ థక్కర్ మార్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఏ క్రమంలోనే ఈ నెల 28న గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
28న అనంతపూర్‌లో గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. అయితే ముందు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అనుకున్నారట. అయితే పవన్ ప్రస్తుతం యూస్ టూర్‌లో ఉండటంతో ఆయన హాజరుకాలేకపోతున్నారట. దాంతో సల్మాన్ ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారట. అలాగే నయనతారకుడా ఈ ఈవెంట్ కు హాజరుకానుందని అంటున్నారు. నిజానికి నయన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చాలా అరుదు.. చాలాకాలం తర్వాత ఇప్పుడు గాడ్ ఫాదర్ ఈవెంట్ కు నయన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, హిందీ భాషల్లో గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.