Chiranjeevi: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సతీమణితో కలిసి రక్తదానం చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. డాన్స్ లతో, నటనతో అంతులేని అశేషాభిమానులను సంపాదించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. డాన్స్ లతో, నటనతో అంతులేని అశేషాభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి సినిమాలతోనే కాదు సేవ గుణం లోను మెగాస్టారే. ఇప్పటికే ఆయన బ్లడ్ బ్యాంక్ ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ కరోనా కష్ట కాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ ఏర్పాటు చేసి ఎంతో మందికి సాయం అందించారు. ఇక ఇటీవలే ఆక్సిజన్ సిలిండర్లను తెలుగు రాష్ట్రాలకు అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడారు. ఇలా మరెన్నో సేవలను చేశారు మెగాస్టార్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా కరోనా బారినుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు. తాజాగా నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ రక్తదానం చేశారు.
రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని మెగాస్టార్ అన్నారు. రక్తదానం చేయాలని చిరంజీవి తన అభిమానులకు పిలుపునిచ్చారు.
On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It’s a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :