Pushpa Movie: ‘పుష్ప’ గురించి ఉప్పెన దర్శకుడు చెప్పిన విషయం తెలిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే..
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు.. అల్లు అర్జున్. బన్నీ పేరుకు ముందు ఈ టైటిల్ అలా ఊరికే వచ్చి చేరలేదు. దీనివెనుక చాలానే స్టోరీ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తామని.
Pushpa Movie:
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు.. అల్లు అర్జున్. బన్నీ పేరుకు ముందు ఈ టైటిల్ అలా ఊరికే వచ్చి చేరలేదు. దీనివెనుక చాలానే స్టోరీ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తామని.. మేకర్స్ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో.. దీన్ని కూడా రెండు పార్టులుగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ నిర్ణయం తర్వాతే.. పుష్ప మేకింగ్ లో చాలామార్పులు చేశారు. అల వైకుంఠపురములో మూవీలో అల్టిమేట్ హిట్ ను అందుకున్న బన్నీ.. పుష్ప మూవీతో బాలీవుడ్ కు బాటలు వేసుకుంటున్నాడు. అందులో భాగంగానే.. పుష్పను రెండు భాగాలుగా తీసుకురావడం.. హిందీ పార్ట్ కోసం బాలీవుడ్ నుంచి ప్రత్యేక యాక్టర్లు, టెక్నీషియన్లను ఈ మూవీలో భాగం చేయడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ శిష్యుడు అయిన ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తాజాగా పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
పుష్పలో మునుపెన్ను కనిపించాని లుక్ లో ఊర మాస్ గా నటిస్తున్నాడు బన్నీ. ఈ సినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. అలాగే ఇందులో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు ఐకాన్ స్టార్. అయితే బుచ్చి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పుష్ప గురించి మాట్లాడాడు. మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీఎఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ గారి డైరెక్షన్ తో పుష్ప సినిమా మరో లెవల్ లో ఉందంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు. దాంతో బన్నీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఖచ్చితంగా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్లుగా బుచ్చి బాబు వ్యాఖ్యలు చేశాడు. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :