AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput: విమానం నడపడం, నాసా వర్క్‌షాప్, అంధులకు కోడింగ్.. వెండితెర ధోని ’50 డ్రీమ్స్’ లిస్టు ఇదే

SSR Dreams: టీవీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అతి కొద్దికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌డ్‌ హీరోగా ఎదిగాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..

Sushant Singh Rajput: విమానం నడపడం, నాసా వర్క్‌షాప్, అంధులకు కోడింగ్.. వెండితెర ధోని '50 డ్రీమ్స్' లిస్టు ఇదే
Sushant
Ravi Kiran
|

Updated on: Jun 14, 2021 | 1:16 PM

Share

టీవీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అతి కొద్దికాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌డ్‌ హీరోగా ఎదిగాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ‘ఎం.ఎస్.ధోని’, ‘చిచోరే’, ‘దిల్ బేచారా’ చిత్రాలతో అటు నార్త్ అభిమానులకే కాదు.. ఇటు సౌత్ ఫ్యాన్స్‌కు కూడా సుశాంత్ ఫేవరెట్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున(జూన్ 14,2020) అభిమానులను ఒంటరివాళ్ళను చేస్తూ ఈ లోకాన్ని వదిలివెళ్లాడు. ఏడాది గడుస్తున్నా సుశాంత్ మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

సుశాంత్ మొదటి వర్దంతి సందర్భంగా.. అతడి అభిమానులు తమ ఆరాధ్య నటుడి జ్ఞాపకాలను మరోసారి స్మరించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ తన జీవితంలో సాధించాలనుకున్న కలలను ఓ పేపర్ మీద రాసి ‘మై 50 డ్రీమ్స్.. అండ్ కౌంటింగ్’ అంటూ అభిమానులతో పంచుకున్న ఓ ట్వీట్.. అతడి మరణం తర్వాత వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆ డ్రీమ్స్‌పై మనం కూడా లుక్కేద్దాం పదండి.!

  • విమానం నడపడం నేర్చుకోవాలి
  • ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడాలి
  • మోర్స్ కోడ్ నేర్చుకోవాలి
  • పిల్లలకు స్పేస్, పాలపుంత గురించి తెలుసుకోవడంలో సహాయం చేయాలి
  • నాలుగు క్లాప్ పుషప్స్ చేయాలి
  • బ్లూ హోల్‌లోకి డైవ్ చేయాలి
  • 1000 మొక్కలు నాటాలి
  • ఢిల్లీలోని నా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఒక సాయంత్రం గడపాలి
  • ఇస్రో, నాసాలో జరిగే వర్క్ షాపులకు 100 మంది పిల్లలను పంపించాలి
  • కైలాష్‌లో మెడిటేషన్ చేయాలి
  • ఒక బుక్ రాయాలి
  • ఆరు నెలల్లో సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలి
  • నాసా వర్క్ షాప్ మరోసారి అటెండ్ అవ్వాలి
  • అంధులకు కోడింగ్ నేర్పించాలి
  • వారం పాటు అడవిలో ఉండాలి
  • డిస్నీ ల్యాండ్ చుట్టి రావాలి
  • ఉచిత విద్య కోసం కృషి చేయాలి
  • మహిళలకు ఆత్మ రక్షణలో శిక్షణ ఇవ్వాలి
  • చిన్నారులకు డ్యాన్స్ నేర్పించాలి
  • లంబోర్‌ఘిని కార్ కొనుగోలు చేయాలి
  • స్వామి వివేకానంద జీవితంపై డాక్యుమెంటరీ తెరకెక్కించాలి.

Also Read: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం