- Telugu News Photo Gallery Cinema photos Sushant singh rajputs 10 photos from his school and college days
Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ మొదటి వర్ధంతి: అద్భుత హీరో రేర్, అన్‌సీన్ ఫోటోలపై ఓ లుక్కేయండి
అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లి ఇవాళ్టి(జూన్ 14)కి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది...
Updated on: Jun 14, 2021 | 11:27 AM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు నార్త్, ఇటు సౌత్ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో.

'పవిత్ర రిస్టా' సీరియల్‌తో బుల్లితెరపై పాపులారిటీ సాధించిన సుశాంత్.. 'కైపోచే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

2011-2016 వరకు టీవీ నటి అంకిత లోఖండే-సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారని వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత హీరోయిన్ కృతిసనన్, సారా ఆలీఖాన్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందులోనూ నిజం లేదు. అయితే 2019 నుంచి మాత్రం రియా చక్రబోర్తి, సుశాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలిసిందే.

‘ఎం.ఎస్.ధోని’, ‘చిచోరే’, ‘దిల్ బేచారా’ చిత్రాలతో భాషతో సంబంధం లేకుండా సుశాంత్ ఎంతోమంది అభిమానులకు చేరువయ్యాడు.

సైన్స్, స్పేస్ ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో అణిచివేతకు గురైన హీరో ఎవరైనా ఉన్నారన్నా.. ఫ్యాన్స్‌కు ముందుగా గుర్తొచ్చే పేరు సుశాంత్.

అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లి ఇవాళ్టి(జూన్ 14)కి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది.

సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించేందుకు ఐదు ఇన్వెస్టిగేటివ్ సంస్థలు రంగంలోకి దిగినా.. ఎవరూ విజయం సాధించలేకపోయారు.

ఈ కేసును చేధించేందుకు ముంబై పోలిస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలో దిగాయి. ఇప్పటికీ ఎవరూ సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించలేకపోయారు.

ప్రస్తుతం ఈ కేసు సీబీఐ చేతుల్లో ఉండటంతో.. వారి ప్రకటన కోసం సుశాంత్ అభిమానులతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.




