- Telugu News Photo Gallery Cinema photos Telugu anchor turned cine actress anasuya bharadwaj konidela niharika srimukhi
TV Anchors: వెండి తెరపైన సత్తా చాటిన టాప్ బుల్లితెర యాంకర్స్..
ప్రస్తుతం సినీ నటులు ఎంత ఫేమ్ సంపాదించుకుంటున్నారో.. బుల్లి తెరపై కూడా అంతే ఫేమ్ ను సొంతం చేసుకుంటున్నారు. దీంతో రెండు రంగాల మధ్య తేడా లేదు.వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా వెలిగిన రాధిక, భానుప్రియ, జయచిత్ర , రాశి వంటివారు బుల్లితెరపై అడుగు పెడితే.. ప్రస్తుతం బుల్లితెరమీద నటీమణులుగా, యాంకర్స్ గా ఫేమస్ అయినవారు హీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు.
Updated on: Jun 13, 2021 | 1:00 PM

స్మాల్ స్క్రీన్ పై కలర్స్షోతో ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యింది. తర్వాత వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి..హీరోయిన్ , సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు సంపాదించుకుంది. అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. నంది అవార్డు ను కూడా సొంతం చేసుకుంది.

న్యూస్ రీడర్ గా బుల్లితెరపై అడుగు పెట్టి.. జబర్దస్త్ షో తో యాంకర్ గా మారింది అనసూయ భరద్వాజ్. ఎన్టీఆర్ నాగ సినిమాలో చిన్నపాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. టాప్ యాంకర్ గా 'రాణిస్తూనే మళ్ళీ సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. క్షణం సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నీహారిక. మొదట వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ లో ఓ డ్యాన్స్ షోకి యాంకర్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదట సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది రష్మీ . అయితే బుల్లి తెరపై యువ సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత టర్న్ తీసుకుని యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టి..కెరీర్ మంచి ఫామ్ లో దూసుకుపోతుంది. రష్మీ గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.

శ్రీముఖి యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఓ వైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. అల్లు అర్జున్ కు జులాయి సినిమాలో చెల్లెలుగా నటించింది. చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది.




