Allu Arjun: అల్లు అర్జున్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తానంటే.. ఆ హీరోయిన్ అలా చెప్పి షాక్ ఇచ్చిందట

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మొన్నటివరకు సౌత్ లో మాత్రమే వినిపించింది. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా రిలీజ్ అయ్యిందో బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది.

Allu Arjun: అల్లు అర్జున్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తానంటే.. ఆ హీరోయిన్ అలా చెప్పి షాక్ ఇచ్చిందట
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 08, 2022 | 9:03 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పేరు మొన్నటివరకు సౌత్ లో మాత్రమే వినిపించింది. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా రిలీజ్ అయ్యిందో బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. బన్నీ ఫాలోయింగ్ ఏకంగా దేశాలు దాటిపోయింది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఒక్కసారైనా బన్నీ సరసన నటించాలని హీరోయిన్స్ చాలా మంది ఎదురుచూస్తుంటారు. బన్నీతో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే..ఒక అమ్మడు మాత్రం వెరైటీగా రియాక్ట్ అయ్యిందట.  నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా..? అని ఓ చిన్నదాన్ని బన్నీ అడగ్గా.. నువ్వు ముసలోడివి అయిపోతావ్ అని సమాధానం చెప్పిందట. దాంతో బన్నీ తెగ నవ్వుకున్నాడట. ఇంతకు బన్నీ నో చెప్పిన ఆ భామ ఎవరో తెలుసా..

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలిసినిమా గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే..అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించి మెప్పించింది కావ్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన కావ్య ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. కావ్య ‘మసూద’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది కావ్య. గంగోత్రి సమయంలో కావ్యను ఆటపట్టిస్తూ బన్నీ.. ”నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నీ డేట్స్ కావాలి అని అన్నారు.. దానికి  “నేను హీరోయిన్ అయ్యే సమయానికి మీరు ముసలోళ్లు అయిపోతారు” అని అన్నానని కావ్య తెలిపింది. దానికి బన్నీ నవ్వేశారు అని చెప్పింది. అయితే ఇప్పుడు బన్నీ సరసన ఛాన్స్ వస్తే ఈ అమ్మడు నో చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి
Child Artist Kavya

Child Artist Kavya

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట