AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz: మరోసారి ప్రేమలోపడిన గోవా బ్యూటీ.. ఆ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా డేటింగ్

అందాల ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా.

Ileana D'Cruz: మరోసారి ప్రేమలోపడిన గోవా బ్యూటీ.. ఆ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా డేటింగ్
Ileana D'cruz
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2022 | 9:34 AM

Share

అందాల ఇలియానా(Ileana) ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కించుకుంది ఇలియానా .. తెలుగుతో పటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది.అలాగే బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ సన్నజాజి. అయితే సౌత్ లో కెరీర్ మంచి పీక్ లో ఉండగానే బాలీవుడ్ వైపు అడుగులేసింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బాలీవుడ్ కు వెళ్లిన సమయంలో ఇలియానా ప్రేమలో కూడా పడింది.

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది ఈ చిన్నది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం ఆ తర్వాత బ్రేకప్ కు దారితీసింది. ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రషన్ లోకి వెళ్ళింది. అదే సమయంలో బరువు కూడా పెరిగింది. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలనుకున్నా సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి ప్రేమలో పడిందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా రిలేషన్ షిప్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యింది కత్రినా కైఫ్.. ఆ టైంలో ఇలియానాతో మీ సోదరుడు సెబాస్టియన్ రిలేషన్ లో ఉన్నారంటగా అని ప్రశ్నించగా.. కత్రినా దాన్ని ఖండించలేదు. అలా అని కన్ఫామ్ కూడా చేయలేదు. దాంతో ఇలియానా , సెబాస్టియన్ రిలేషన్ పై ఓ కహింట్ వచ్చింది ప్రేక్షకులకు. ఇటీవల కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడే కత్రినా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.  కత్రినా కుటుంబసభ్యులతో పటు.. ఇలియానా కూడా వారితో జాయిన్ అయ్యింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఇలియానా, సెబాస్టియన్ ఇద్దరు బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారట.  మొత్తంగా గోవా ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలు పడిందని బీ టౌన్ మొత్తం కోడై కూస్తోంది.

ఇవి కూడా చదవండి
Ileana D'cruz Katrina Kaif

Ileana D’cruz Katrina Kaif

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు!
స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు!
మద్యం మత్తులో కిరాతకం.. కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
మద్యం మత్తులో కిరాతకం.. కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన మిస్ చేసుకున్నాడా.?
అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన మిస్ చేసుకున్నాడా.?
భూమి మీద దొరికే ఈ అమృతం పాడైపోయిన కిడ్నీలను సైతం రిపేర్
భూమి మీద దొరికే ఈ అమృతం పాడైపోయిన కిడ్నీలను సైతం రిపేర్
మీషో విజయ రహస్యం.. ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి?
మీషో విజయ రహస్యం.. ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి?
5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్..
5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్..
మార్క్‌ఫెడ్ చరిత్రలోనే తొలిసారి ఆల్‌టైమ్‌ రికార్డు ధర..
మార్క్‌ఫెడ్ చరిత్రలోనే తొలిసారి ఆల్‌టైమ్‌ రికార్డు ధర..
ప్రెగ్నెన్సీ టెస్టుల కోసం ఆస్పత్రికి మహిళ.. రిపోర్ట్‌లో..
ప్రెగ్నెన్సీ టెస్టుల కోసం ఆస్పత్రికి మహిళ.. రిపోర్ట్‌లో..
కోహ్లీ vs గంభీర్ గొడవ.. 13 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన అంపైర్
కోహ్లీ vs గంభీర్ గొడవ.. 13 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన అంపైర్
సడెన్‌గా మీ నోట్లోకి ఈగ, దోమలాంటిది దూరిందా? టెన్షన్‌ పడకుండా ఇలా
సడెన్‌గా మీ నోట్లోకి ఈగ, దోమలాంటిది దూరిందా? టెన్షన్‌ పడకుండా ఇలా