Oke Oka Jeevitham: సినిమా చూస్తూ కంటతడి పెట్టుకున్న నాగ్.. ఒకే ఒకే జీవితం ప్రీమియర్ షోలో ఎమోషన్ అయిన కింగ్..
Oke Oka Jeevitham: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అక్కినేని అమల తల్లి పాత్రలో నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది...
Oke Oka Jeevitham: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల తల్లి పాత్రలో నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అఖిల్, అమలాతో పాటు దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి పాల్గొన్నారు.
సినిమా చూసిన అంనతరం నాగార్జున, అఖిల్ ఎమోషన్‌కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలకు నాగార్జునను కంటతడి పెట్టించాయంట. మంచి కథను అద్భుతంగా తెరకెక్కించన దర్శకుడిపై నాగ్ ప్రశంసలు కురిపించారు. అలాగే తన అద్భుత నటనతో ఆకట్టుకున్న శర్వాపై అభినందనలు కురిపించారు. అంతేకాకుండా దర్శకుడు హనురాఘవ పూడి, చందూ మొండేటి సైతం ఒకే ఒక జీవితంపై ప్రశంసలు కురిపించారు.
గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో టైమ్ ట్రావెలింగ్‌ను ఎలా చూపించారన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. మరి సెలబ్రిటీలను మెప్పించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు రంజిపం చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..