Bigg Boss Season 6: రసవత్తరంగా సాగుతోన్న నామినేషన్.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్
బిగ్ బాస్ సీజన్ 6లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తొలి వారమే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. పైగా నామినేషన్ ప్రక్రియ ఉండటంతో మరింత రసవత్తరంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Season 6)లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తొలి వారమే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. పైగా నామినేషన్ ప్రక్రియ ఉండటంతో మరింత రసవత్తరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ రెచ్చిపోయారు. లైగర్ వాట్ లగాదేంగే సాంగ్ తో నిద్ర లేచిన హౌస్మేట్స్ హుషారుగా చిందులేశారు. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కపుల్ మెరీనా-రోహిత్ రచ్చ రోజు రోజుకు పెరుగుతోంది. నాకు టైం కేటాయించడం లేదు.. హగ్ ఇవ్వడం లేదు కిస్ ఇవ్వడం లేదు.. అని మెరీనా లాగడం భాదపడటం.. దానికి రోహిత్ ఎక్స్‌ప్లేన్ చేయడం జరుగుతూనే ఉంది. సింగర్ రేవంత్ వాయిస్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. రేవంత్ హౌస్ మేట్స్ ను కంట్రోల్ చేస్తూ కనిపించాడు.
ఇక నామినేషన్స్ విషయానికొస్తే .. క్లాస్‌లో ఉన్న గీతు, ఆదిరెడ్డి, నేహా చౌదరిలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ట్రాష్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారు. మాస్‌లో ఉన్న మిగిలిన సభ్యులకు నామినేషన్స్ ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి హౌస్ లోకి వచ్చిన కపుల్ మెరీనా-రోహిత్ లలో ఏ ఒక్కరిని ఎవరైనా నామినేట్ చేస్తే ఇద్దరూ నామినేట్ అవుతారు. అంటే ఈ ఇద్దరిలో ఒక్కరు ఎలిమినేటి అయిన ఇద్దరు హౌస్ వదిలి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. ఇక నామినేషన్‌లో ఉన్న వారిలో ఆరోహి- ఇనయ- అభినయ శ్రీ- సింగర్ రేవంత్- జబర్దస్త్ ఫైమా- శ్రీ సత్య- చలాకీ చంటి నామినేషన్ లో ఉన్నారు. అయితే ట్రాష్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయలలో ఒకర్ని సేవ్ చేసే అవకాశాన్ని క్లాస్‌లో వీరికి ఇచ్చాడు. దాంతో బాలాదిత్యను సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో ఆరోహిని నామినేట్ చేశారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..