Superstar Krishna: మహేష్ కాకుండా ఆ హీరో అంటే ఇష్టమన్న సూపర్ స్టార్ కృష్ణ
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో కృష్ణ. ఆయన నటన ఓ అద్బుతమనే చెప్పాలి. ఎన్టీఆర్, ఎన్నార్ లాంటి దిగ్గజాలకు పోటీ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ సక్సెస్ అయ్యారు.
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో కృష్ణ(Superstar Krishna). ఆయన నటన ఓ అద్బుతమనే చెప్పాలి. ఎన్టీఆర్, ఎన్నార్ లాంటి దిగ్గజాలకు పోటీ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ సక్సెస్ అయ్యారు. మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కృష్ణ. ఇక ఆయన నటించిన సినిమాలు చాలా సూపర్ హిట్స్ గా నిలిచాయి. అంతే కాదు ఏడాదికి అత్యధిక సినిమాలు చేసే హీరోగానూ కృష్ణకు పేరుంది. ఇక ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. కృష్ణ నటనను, అభినయాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అప్పట్లో కృష్ణకు ఎంత ఫాలోయింగ్ ఉండేదో.. ఇప్పుడు మహేష్ కు దానికిమించి రెండింతల ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ సినిమాల విషయంలోనూ కృష్ణ జడ్జ్ మెంట్ ఇస్తూ ఉంటారు.
ప్రస్తుతం కృష్ణ సినిమాలు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ప;యూ యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కృష్ణ. తాజాగా ఆయన ఓ ఇంట్రవ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా కృష్ణ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. తారక్ నటనంటే తనకు చాలా ఇష్టమని కృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తారక్ తాతగారు అయిన సీనియర్ ఎన్టీఆర్ గురించి.. ఆయనతో ఉన్న అనుబంధం గురించి కూడా తెలిపారు కృష్ణ. ఇక మహేష్ , తారక్ కూడా అన్నదమ్ముల ఉంటారు. తారక్ మహేష్ ను ప్రేమగా అన్న అని పిలవడం మనకు తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..