Sharwanand: “ఆ సినిమా దెబ్బకు 3 నెలల పాటు బయటకు రాలేదు”.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్(Sharwanand)ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శర్వా.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్(Sharwanand)ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శర్వా. ఈ మధ్యకాలంలో శర్వానంద్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ మాత్రం సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. గత కొంత కాలంగా శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. శర్వా సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది.. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. మొన్నీమధ్య ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తిరుమల కిషోర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మళ్లీ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.
ప్రస్తుతం శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించనున్నారు. శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు శర్వా. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో దాదాపు మూడు నెలలు బయటకు రాలేదు అన్నారు. పడి పడి లేచే మనసు సినిమా తనను బాగా నిరాశకు గురిచేసిందని అన్నాడు శర్వా. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నా.. కానీ అలా జరగలేదు. ఒక 3 నెలల పాటు నేను బయటకు రాలేదు ఆ సినిమా రిజల్ట్ వల్ల. ఆ సినిమా ఆడుతుంది నమ్మి అని 130,140 రోజులు కష్టపడి పనిచేశాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..