AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth : పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించాలనుకున్న రజినీకాంత్.. కానీ డైరెక్టర్ ఓకే చెప్పలేదట.. ఎందుకంటే..

ఈ వేడుకకు కమల్ హాసన్, రజినీ కాంత్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. ఈ మూవీలో తాను నటించాలనుకున్నానని.. కానీ డైరెక్టర్ మణిరత్నం నో అన్నారని చెప్పుకొచ్చారు.

Rajinikanth : పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించాలనుకున్న రజినీకాంత్.. కానీ డైరెక్టర్ ఓకే చెప్పలేదట.. ఎందుకంటే..
Rajini Kanth
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2022 | 7:24 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చోళుల స్వర్ణయుగాన్ని ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ మంగళవారం చెన్నైలో అట్టహసంగా జరిగింది. ఈ వేడుకకు కమల్ హాసన్, రజినీ కాంత్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. ఈ మూవీలో తాను నటించాలనుకున్నానని.. కానీ డైరెక్టర్ మణిరత్నం నో అన్నారని చెప్పుకొచ్చారు.

నేను పొన్నియిన్ సెల్వన్‌లో భాగం కావాలనుకున్నాను. నాకు పెరియ పజువెట్టరైర్ పాత్ర ఇవ్వమని మణిరత్నంని అడిగాను. చిన్న పాత్ర అయినా సరే నేను చేస్తాను అని చెప్పాను. కానీ ఆయన మీ అభిమానులతో నన్ను తిట్టించాలనుకుంటున్నారా ? అని అడిగారు. నేను తమ సినిమాలో నటిస్తానంటే వేరే ఎవరైనా సరేనని ఒప్పుకుంటారు.. కానీ మణి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అదీ మణిరత్నం అంటే. పొన్నియిన్ సెల్వన్ లోని వంతియాతివన్ (కార్తి పోషించిన పాత్ర)కు నేను సెట్ అవుతానని గతంలో ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత చెప్పారు. ఆమె చెప్పిన మాటతోనే పొన్నియన్ సెల్వన్ పుస్తకం చదివాను. రచయిత కల్కి మన మధ్య ఉండి ఉంటే.. ఇంటికి వెళ్లి పాదాలకు నమస్కారం చేసేవాణ్ని. పొన్నియన్ సెల్వన్ అనేది అరుళ్ మొళివర్మన్ కథ కాదు. నందిని (ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర) కథ. ఇప్పుడున్న రోజుల్లో నందిని పాత్రని ఎవరూ చూసి ఉండరు. నరసింహలో నీలాంబరి పాత్రకు నందిని పాత్రే స్పూర్తి. ఈ కథ చదివిన తర్వాత అరుళ్ మొళివర్మన్ (జయం రవి) పాత్రకు కమల్ హాసన్, కుందవై (త్రిష)పాత్రకు శ్రీదేవి, ఆదిత్య కరికాలన్ (విక్రమ్) పాత్రకు విజయ్ కాంత్ ను ఊహించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు రజినీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.