Mahesh Babu: నెట్టింటిని షేక్ చేస్తున్న మహేష్ జిమ్ వీడియో.. ఆ రన్నింగ్ ఏంటీ బాసు..
ఇప్పటికే కొత్త లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిన మహేష్.. ఇప్పుడు ఫిట్ నెస్ పై ఫోకస్ చేశారు.
సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. మహేష్ కెరీర్లో 28వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల పలు యాడ్స్లలో నటిస్తూ బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 సినిమా కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొత్త లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిన మహేష్.. ఇప్పుడు ఫిట్ నెస్ పై ఫోకస్ చేశారు.
తాజాగా సూపర్ స్టార్‌కు సంబంధించిన లేటేస్ట్ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ట్రెడ్ మిల్ పై మహేష్ జెట్ స్పీడ్‌లో రన్ చేస్తున్నాడు. 47 వయసుల్లోనూ మహేష్ అంత స్పీడ్ గా అగ్రెసివ్ గా పరిగెత్తడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోనూ నటించనున్నారు.
ట్వీట్..
Finishing todays workout on a high with @urstrulyMahesh ? #intensitymatters pic.twitter.com/LpBvnnXtQi
— Lloyd Stevens (@lloydstevenspt) September 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.