Rashmika Mandanna: అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ విషయంలో తన కల నిజమైందంట..

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడపేస్తుంది రష్మిక. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో వరుస ప్రాజెక్టులలో నటిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఫాలోవర్లకు క్రేజీ న్యూస్ చెప్పింది.

Rashmika Mandanna: అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ విషయంలో తన కల నిజమైందంట..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2022 | 6:48 PM

పాన్ ఇండియా లెవల్లో అత్యంత ఎక్కువ ఫాలోవర్లు హీరోయిన్ రష్మిక మందనా (Rashmika Mandanna). కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక తెలుగులో చలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయైన ఈ అమ్మడు.. గీతా గోవిందం మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడపేస్తుంది రష్మిక. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో వరుస ప్రాజెక్టులలో నటిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఫాలోవర్లకు క్రేజీ న్యూస్ చెప్పింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సిక్వెల్ పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. త్వరలోనే అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గోననున్నారు. ఈ మూవీ షూటింగ్ లో తాను త్వరలో పాల్గొనబోతున్నట్లు చెప్పింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రష్మిక నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. అమితాబ్ గారితో నటించాలనే తన కల నిజమైందని తెలిపింది. మరో రెండు రోజుల్లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ కాబోతుందని చెప్పుకొచ్చింది. దీంతో పుష్ప ది రూల్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు చెప్పింది నేషనల్ క్రష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.