AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: రాజమౌళి ప్రతి సినిమాలో ఈ నటుడు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా..?

సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న సినిమాలో నటించాలనుకుంటారు. కానీ ఒక విషయం గమనించారా..? రాజమౌళి ప్రతి సినిమాలో కొందరు నటీనటులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన ప్రతి సినిమాలో పైన ఫోటోలో కనిపించిన నటుడు ఒకరు. అతడి పేరు చత్రిపతి శేఖర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన శాంతి నివాసం సీరియల్ నుంచి ట్రిపుల్ ఆర్ చిత్రం వరకు ప్రతి సినిమాలోనూ ఏదోక పాత్రలో కనిపిస్తుంటారు.

Rajamouli: రాజమౌళి ప్రతి సినిమాలో ఈ నటుడు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Chatrapathi Sekhar
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 9:11 PM

Share

డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడు. తెలుగు సినిమా స్థాయిని తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకధీరుడు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ట్రిపుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుంది. అంతేకాకుండా తెలుగు అడియన్స్ కలగా భావించిన ఆస్కార్ అవార్డ్ సైతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమాలపై.. అతడి డైరెక్షన్ పై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించిన సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే జక్కన్న సినిమాల్లో నటించాలని.. ఒక చిన్నక్యారెక్టర్ అయినా చేయాలని నటీనటులు ఎన్నో కలలు కంటారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న సినిమాలో నటించాలనుకుంటారు. కానీ ఒక విషయం గమనించారా..? రాజమౌళి ప్రతి సినిమాలో కొందరు నటీనటులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన ప్రతి సినిమాలో పైన ఫోటోలో కనిపించిన నటుడు ఒకరు. అతడి పేరు చత్రిపతి శేఖర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన శాంతి నివాసం సీరియల్ నుంచి ట్రిపుల్ ఆర్ చిత్రం వరకు ప్రతి సినిమాలోనూ ఏదోక పాత్రలో కనిపిస్తుంటారు.

రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆ తర్వాత వచ్చిన సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ, ఆర్ఆర్ఆర్ ఇలా జక్కన్న తెరకెక్కించిన అన్ని సినిమాల్లో శేఖర్ కచ్చితంగా కనిపిస్తాడు. రాజమౌళి మొత్తం 12 చిత్రాలు తెరకెక్కించగా.. 9 సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు శేఖర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన చత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా నుంచి అతడిని చత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. రాజమౌళి సినిమాలలో శేఖర్ కనిపించడానికి ఓ కారణం ఉంది.

రాజమౌళి మొదటిసారిగా దర్శకత్వం వహించిన శాంతి నివాసం సీరియల్ సమయంలోనే శేఖర్‏తో పరిచయం ఏర్పడింది. కానీ శేఖర్ ఎప్పుడూ జక్కన్నను అవకాశాలు ఇవ్వాలని అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్ధేశంతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారని గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు శేఖర్. సినిమా స్టార్ట్ చేశాక తనకు పాత్ర ఉందని రాజమౌళి తనను పిలుస్తాడని.. అప్పటివరకు సినిమా ఏంటీ.. తన పాత్ర ఏంటనేది తనకు తెలియదని అన్నారు. మొదటి సీరియల్లో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత స్నేహానికి జక్కన్న ఇచ్చే విలువ తెలిసి హ్యాట్సాఫ్ రాజమౌళి అంటున్నారు నెటిజన్స్.