- Telugu News Photo Gallery Cinema photos Tollywood Star Heroes Jr.NTR Mahesh Babu Ram Charan New Makeover For Upcoming Films
Tollywood News: మేకోవర్ పై ఫోకస్ పెట్టిన ముగ్గురు మొనగాళ్లు
ఇట్స్ మేకోవర్ టైమ్ అంటున్నారు మన హీరోలు. ఒక్కో సినిమా వందల కోట్లు ఖర్చు పెడుతుంటారు కాబట్టి దానికి తగ్గట్లుగా ఛేంజ్ అవ్వడానికి కూడా టైమ్ తీసుకుంటున్నారు మన స్టార్స్. ఇందులో భాగంగానే ముగ్గురు స్టార్ హీరోలు ఇదే పనిమీద బిజీగా ఉన్నారిప్పుడు. మరి వాళ్లెవరు..? ఏయే సినిమాల కోసం వాళ్లు మేకోవర్ అవుతున్నారో చూద్దాం పదండి..
Updated on: Aug 16, 2024 | 8:16 PM

సినిమా అప్‌డేట్ లేకపోయినా... మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ సారి సోషల్ మీడియా ట్రెండ్‌లో మహేష్‌ను గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు.

ఎప్పుడూ ఒకే లుక్‌లో ఏం కనిపిస్తాం చెప్పండి..? సినిమా సినిమాకు మారిపోతుంటేనే కదా అసలు మజా అంటున్నారు మన హీరోలు. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా.. లుక్‌లో మాత్రం చూపించాలని ఫిక్సయ్యారు స్టార్స్. ఈ నేపథ్యంలోనే రాజమౌళి అడ్వంచరస్ మూవీ కోసం చెమటోడుస్తున్నారు మహేష్ బాబు. గుంటూరు కారం తర్వాత అదే పనిమీద ఉన్నారు మహేష్.

ప్రశాంత్ నీల్ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్‌తో తారక్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం జైలర్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు నెల్సన్. ఈ లోపు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్.

టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లడమో, మేకోవర్ అవ్వడమో అంటారా.? యస్.. అవి ఎలాగూ ఉంటాయి. వాటిని మించింది కూడా ప్లాన్ చేస్తారు స్టార్ హీరోలు.

బుచ్చిబాబు సినిమాకు కమిట్ అయి కూడా ఏడాది అవుతుంది. ఆ మధ్య ఓపెనింగ్ కూడా జరిగింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. స్పోర్ట్స్ డ్రామా కావడంతో లుక్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు చరణ్. మొత్తానికి ఎన్టీఆర్, మహేష్ బాబు, చరణ్.. ముగ్గురి సినిమాలు దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ టైమ్‌లోనే మొదలు కానున్నాయి.




