AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpika Ganesh: సినీనటి కల్పికపై కేసు నమోదు.. కారణం ఇదే..

టాలీవుడ్ నటి కల్పికకు ఊహించని షాక్ తగిలింది. ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా తమ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని.. తమ సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టారని పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Kalpika Ganesh: సినీనటి కల్పికపై కేసు నమోదు.. కారణం ఇదే..
Kalpika Ganesh
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2025 | 10:31 AM

Share

టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29 ప్రిజం పబ్‏లో బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని.. తమ సిబ్బందిని బూతులు తిట్టడంతోపాటు బాడీ షేమింగ్ చేసిందని.. ప్లేట్స్ విసిరేయడం జరిగిందంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై 324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారని.. బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి.. బూతులు తిట్టారని.. తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది. ఇక ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత నెల 29న కల్పిక గణేష్ బర్త్‌డే కావడంతో తన ఫ్రెండ్స్‌కీ ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు, కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కల్పికపై కేసు నమోదైంది.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో కల్పిక మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్‌సిరీసుల్లోనూ నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో చిక్కుకున్న కల్పిక.. ఇప్పుడు ఈ పబ్‌ వివాదంతో వార్తల్లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్