Racha Ravi: ఆ పార్టీకి నేను వెళ్లలేదు.. దయచేసి అర్థం చేసుకోండి.. రచ్చ రవి కామెంట్స్..
హైదరాబాద్ శివారు ప్రాంతంలో చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో జూన్ 10న అర్థరాత్రి తెలంగాణ పోలీసులు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడి చేశారు. అర్థరాత్రి డీజే సౌండ్లు వినిపించడం.,...స్థానికులు ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేశారు. రిసార్ట్‌లో సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ సినీ రచయత కాసర్ల శ్యాం, బిగ్‌ఫేస్ ఫేం దివితో పాటు పలువురు సినీ ప్రముఖులు పార్టీలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

సింగర్ మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో జూన్ 10న అర్థరాత్రి పోలీసులు ఆక్మసిక దాడి చేయడంతోపా ఆమె బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, గంజాయి పట్టుబడినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగ్లీతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో, విదేశీ మద్యం సీజ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకలలో దాదాపు 50 మంది పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు, వీరిలో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రిసార్ట్‌లో సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ సినీ రచయత కాసర్ల శ్యాం, బిగ్‌ఫేస్ ఫేం దివి , జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి సైతం ఉన్నారని పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో రచ్చ రవి సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
“మంగ్లీ బర్త్ డే పార్టీలో నేను పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నట్లు కొందరు మిత్రుల ద్వారా నా దృష్టికి వచ్చింది. నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ పార్టీకి వెళ్లలేదు.. గత కొన్ని రోజులుగా నా షెడ్యూల్ వల్ల చాలా బిజీ.. వరుసగా షూటింగ్స్ చేస్తున్నాను. సొంత కుటుంబాన్ని చూడడానికి కూడా ఇంటికి వెళ్లందుకు టైం లేదు. అలాంటి సమయంలో నేను పార్టీకి వెళ్లినట్లు న్యూస్ ఛానల్స్ లో వార్తలు రావడం చూసి ఆశ్చర్యపోయాను. దయచేసి అర్థం చేసుకోండి. నా గురించి అసత్యాలు ప్రచారం చేయకండి. ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చ రవి.. అక్కడున్న వ్యక్తి నేను కాదు.” అంటూ చెప్పుకొచ్చారు. నేను తాగను.. తాగబోను.. నాకు తెలవదు.. దయచేసి అర్థం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు.
సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం దొరకడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘవత్ దునే, అతని ఫ్రెండ్స్ రామకృష్ణ, దామోదర్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు మత్తు పదార్ధాలు తమ పార్టీలో లేవని…సౌండ్ ఇష్యూ వల్లే పోలీసులు రైడ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. ఆన్లైన్‌లో అప్లికేషన్లు పెట్టుకోగానే పర్మిషన్లు ఇచ్చేస్తాం కదా.. ప్రాసెస్ ఇంత సింప్లిఫై చేసినా అనుమతుల్లేకుండా పార్టీలెందుకు అన్నది పోలీసులు ప్రశ్న. దర్యాప్తులో భాగంగా రిసార్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వేడుకలో పాల్గొన్న వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మొత్తానికి అనధికారికంగా పార్టీ ఇవ్వడంతో సింగర్ మంగ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
రచ్చ రవి ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




