Avika Gor: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటోస్ వైరల్.. అవికా గోర్‌కు కాబోయే భర్త ఎవరంటే?
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఛైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ అందాల తార ఇప్పుడు జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యింది.

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. త్వరలోనే తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యింది. తాజాగా అవికా గోర్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో కలిసి ఉంగరాలు మార్చుకుందీ అందాల తార. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘అతను నోరు తెరిచి అడగ్గానే.. ఆనందంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగిపోయిన నాకు ఇప్పుడు మైండ్‌లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్‌లో మా కల సాకారమైనట్లు కనిపిస్తోంది. అతనేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. జంటగా బాగా ఫిట్టయ్యాం.ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే నేమో! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది అవిక.
పదేళ్లకే కెమెరా ముందుకు..
ప్రస్తుతం అవికాగోర్- మిలింద్ చంద్వానీ ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్రో’, ‘షణ్ముఖ’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది.
ప్రియుడితో అవికా గోర్..
View this post on Instagram
అలా మొదలైంది..
ఇక అవికా గోర్ ను మనువాడబోయే మిలింద్ చాంద్వానీ విషయానికి వస్తే.. ఇతను ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. 2019లో క్యాంప్ డైరీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అవికా గోర్ పాల్గొంది. అప్పటి నుంచే మిలింద్ తో పరిచయం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత పదిలం చేసుకోనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








