Tollywood: సినిమాలు వదిలేసి ఐటీలో జాబ్.. కట్ చేస్తే.. 20 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తోన్న టాప్ హీరోయిన్..
తెలుగు సినీరంగంలో ఒకప్పుడు అనేక చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగమ్మాయి.. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాలలో ఎక్కువగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న ఆమె ఇప్పుడు దాదాపు 20 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలలో ఆమె ఒకరు. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. కొన్ని సంవత్సరాలుగా ఐటీలో జాబ్ చేస్తుంది. ఇక ఇప్పుడు దాదాపు 20 ఏళ్లకు తిరిగి సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ఆమె నటించిన ఓ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ లయ. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ దాదాపు అందరు హీరోలతో జత కట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన లయ.. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లయ, వర్ష బొలమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తమ్ముడు చిత్రం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో లయ మాట్లాడుతూ.. తమ్ముడు సినిమాతో తిరిగి సినీప్రయాణం స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. తన సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుందని అన్నారు. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఎన్నో భయాలు, సందేహాలు ఉండేవి అని.. కానీ తమ్ముడు టీం తనలోని భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించారని అన్నారు.
లయ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




