AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli : పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నాకు తెలియదు.. బర్త్ డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ..

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగళవారం అర్దరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Rajitha Chanti
|

Updated on: Jun 12, 2025 | 9:32 AM

Share

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‏లో అర్దరాత్రి జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్‏పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారని… మంగ్లీతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని వార్తలు వినిపించాయి. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని.. లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.

“నా బర్త్ డే పార్టీ మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబసభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పార్టీలో మా ఫ్యామిలీతోపాటు బంధువులు, స్నేహితులు ఉన్నారు. లిక్కర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. లిక్కర్ కు, సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగహన లేదు. రిసార్ట్ పార్టీ అనుకోకుండా.. సడెన్ ప్లాన్ చేసుకున్నాము. నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అక్కడ పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి మత్తు పదార్థాలు లేవు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్త పదార్థాలు దొరకలేదు. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ఎక్కడో.. ఎప్పుడో తీసుకున్నాడని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్ ” అంటూ మంగ్లీ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..