‘సాహో’ నిర్మాతలపై కేసు నమోదు !..ఎందుకంటే?

'సాహో' నిర్మాతలపై కేసు నమోదు !..ఎందుకంటే?

తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను ‘సాహో’ సినిమాలో హీరో, హీరోయిన్లు వాడినట్లు చూపించడంతో పాటు, ప్రచారం కల్పిస్తామంటూ రూ.1.38 కోట్లకు పైగా డబ్బు తీసుకుని చిత్ర నిర్మాతలు మోసగించారంటూ ఓ బ్యాగుల తయారీ సంస్థ మాదాపూర్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సాహో’  నిర్మాతలు వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌కుమార్‌లు తమ బ్యాగులను సినిమాలో వినియోగిస్తామని, హీరో, హీరోయిన్లు వాడేలా చూస్తామంటూ రూ.1.38 కోట్లు తీసుకున్నారని బెంగళూరుకు చెందిన ‘ఔట్‌షైనీ’ […]

Ram Naramaneni

|

Oct 18, 2019 | 2:15 AM

తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను ‘సాహో’ సినిమాలో హీరో, హీరోయిన్లు వాడినట్లు చూపించడంతో పాటు, ప్రచారం కల్పిస్తామంటూ రూ.1.38 కోట్లకు పైగా డబ్బు తీసుకుని చిత్ర నిర్మాతలు మోసగించారంటూ ఓ బ్యాగుల తయారీ సంస్థ మాదాపూర్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సాహో’  నిర్మాతలు వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌కుమార్‌లు తమ బ్యాగులను సినిమాలో వినియోగిస్తామని, హీరో, హీరోయిన్లు వాడేలా చూస్తామంటూ రూ.1.38 కోట్లు తీసుకున్నారని బెంగళూరుకు చెందిన ‘ఔట్‌షైనీ’ బ్యాగుల తయారీ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక సినిమా ప్రదర్శన సమయంలో యాడ్స్ వేస్తామని గత జులై 8న ఒప్పందం చేసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించింది. అయితే సదరు సినిమాలో ఆ బ్యాగులను వాడకపోగా ఎలాంటి  పబ్లిసిటి చేయకుండా మోసగించారని ఆ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ విజయరావు గురువారం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టనున్నామని పోలీసులు తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu