అరవ హీరో..తెలుగు ట్రైలర్..’విజిల్’ వేయిస్తున్నాడంతే..!

అరవ హీరో..తెలుగు ట్రైలర్..'విజిల్' వేయిస్తున్నాడంతే..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’.  ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్​ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది.  ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ‘విజిల్’ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ తండ్రికొడుకులుగా డబల్ రోల్ లో నటించినా.. మొత్తం మూడు […]

Ram Naramaneni

|

Oct 18, 2019 | 4:24 AM

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’.  ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్​ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది.  ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ‘విజిల్’ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ తండ్రికొడుకులుగా డబల్ రోల్ లో నటించినా.. మొత్తం మూడు విభిన్న గెటప్స్‌లో అభిమానులను మెస్మరైజ్ చేయనున్నాడు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే పక్కా పవర్ పాక్డ్‌గా ఉంది. ఇందులో ఫుట్‌బాల్‌ కోచ్​గా కనిపించనున్నాడు ఇళయదళపతి. నయనతార, విజయ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కనువిందు చేస్తున్నాయి. ట్రైలర్ లో ఎక్కువగా ఇంప్రెస్ చేసే మరో అంశం ఫుట్ బాల్‌ను నైపుణ్యంతో విజయ్ హ్యాండిల్ చేసే తీరు.  ఓవరాల్ గా చూస్తే ఈ మాస్ మసాలా లాగా కనిపిస్తోంది.   యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. విజువల్స్​తో పాటు ఏఆర్​ రెహ్మన్ నేపథ్య సంగీతం అలరిస్తోంది. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు మూడు నిమిషాల నిడివితో ఉన్న తాజా ట్రైలర్‌లో లవ్, ఎమోషన్, యాక్షన్ మేళవింపుతో బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించేట్టుగానే ఉంది. విజయ్​, అట్లీ కాంబోలో గతంలో తెరీ(పోలీసోడు), మెర్సల్‌(అదిరింది) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరి హ్యట్రిక్ కొట్టి ఈ ద్వయం సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తుందో..లేదో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu