అమితాబ్ బచ్చన్‌కు తీవ్ర అస్వస్థత..!

అమితాబ్ బచ్చన్‌కు తీవ్ర అస్వస్థత..!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. లివర్ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమాలో కనిపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా గోసాయి వెంకన్న పాత్రలో అలరించారు. మరోవైపు ఆయుష్మాన్ ఖురానాతో కలసి […]

Ram Naramaneni

|

Oct 18, 2019 | 12:50 AM

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. లివర్ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమాలో కనిపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా గోసాయి వెంకన్న పాత్రలో అలరించారు. మరోవైపు ఆయుష్మాన్ ఖురానాతో కలసి ‘గులాబో సితాబో’ సినిమాతో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో కలసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 24న బిగ్ బిను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

కాగా ఇటీవలే అమితాబ్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టాడు. స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ… టీబీ సోకిన 8 ఏళ్ల వరకు తనకు ఆ విషయమే తెలియదని, చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో బయటపడిందని తెలిపాడు.

‘గతంలో నాకు క్షయ(టిబి), హెపటైటిస్ బి వ్యాధులు ఉండేది. క్షయ సోకిందనే విషయం 8 ఏళ్ల వరకు తెలియలేదు. రెగ్యులర్‍‌ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో నా 25 శాతం లివర్(కాలేయం) చెడిపోయింది. ప్రస్తుతం నేను 25 శాతం కాలేయంతోనే సర్వైవ్ అవుతున్నాను’ అని బిగ్ బి తెలిపాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu