మెగాస్టార్ 152 మూవీ టైటిల్ ఇది కాదా?..

మెగాస్టార్ 152 మూవీ టైటిల్ ఇది కాదా?..

మెగాస్టార్ చిరంజీవి సైరా సక్సెస్ జోష్‌తో ఉన్నారు. ఆయన నట జీవితంలో 152 మూవీ చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. రాజకీయాలనుంచి పూర్తిగా దూరమైన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150 చేశారు. ఆ తర్వాత ఇటీవల విడుదలైన సైరాతో పూర్తి స్ధాయిలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చిరు. ఇప్పటికే టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్లలో ఒకరైన కొరటాల శివతో మెగాస్టార్ 152 చిత్రం ఉండబోతుందని సోషల్ మీడియా ఇప్పటికే కోడై కూస్తున్న విషయం తెలిసిందే. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 8:38 PM

మెగాస్టార్ చిరంజీవి సైరా సక్సెస్ జోష్‌తో ఉన్నారు. ఆయన నట జీవితంలో 152 మూవీ చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. రాజకీయాలనుంచి పూర్తిగా దూరమైన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150 చేశారు. ఆ తర్వాత ఇటీవల విడుదలైన సైరాతో పూర్తి స్ధాయిలో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చిరు.

ఇప్పటికే టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్లలో ఒకరైన కొరటాల శివతో మెగాస్టార్ 152 చిత్రం ఉండబోతుందని సోషల్ మీడియా ఇప్పటికే కోడై కూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “గోవింద ఆచార్య” అనే టైటిల్‌ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ టైటిల్‌ను కన్ఫార్మ్ చేయలేదంటూ ఆ సంస్ధ ఓ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో చిరుతో పాటు చెర్రీ కూడా ఉన్నట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్. ఇప్పటికే సైరా మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్.. ఈసారి కొరటాల డైరక్షన్‌లో మరోసారి దుమ్ము దులిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏది ఏమైనా చిరంజీవి స్వతహాగా పదిమందికి సేవ చేసే గుణంగల హీరో.. తన చిత్రాల ద్వారా సమాజ హితాన్ని కోరుకునే దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్‌పై చాల అంచానాలున్నాయి. ఈ మూవీ వచ్చే వేసవిలో లో రిలీజ్ చేయడానికి ప్లాన్ కూడ చేస్తున్నారట.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu