టాప్ 10 న్యూస్ @9PM

టాప్ 10 న్యూస్ @9PM

1.పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు! కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం…Read more 2.అసోంలో ఘోర పడవ ప్రమాదం… పలువురు గల్లంతు అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు  జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 8:57 PM

1.పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు!

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం…Read more

2.అసోంలో ఘోర పడవ ప్రమాదం… పలువురు గల్లంతు

అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు  జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్‌ తపూ సమీపంలోని బిహియా గావ్‌ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్‌ మైల్‌…Read more

3.బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు…Read more

4.ముంచుకొస్తున్న మాంద్యం… ఆర్థిక వ్యవస్థ కుదేలు!

దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కమ్మేస్తున్నది. 2019వ సంవత్సరం ప్రారంభం నుండి వివిధ రంగాలకు సంబంధించి ఉత్పత్తి తగ్గటంపై వెల్లడౌతున్న అంశాలను జులై నెలకు విడుదల చేసిన అంకెలు స్థిరపరిచాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తగ్గింది…Read more

5.ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ న్యూస్ !

సికింద్రాబాద్‌కు వెళుతున్నారా ? ప్యారడైజ్ బిర్యానీ అంటే నోరూరుతోందా ? జర జాగ్రత్త.. అక్కడ బిర్యానీ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట అంటున్ననది మేము కాదు.. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు. అసలేం జరిగిందంటే…Read more

6.భార్యతో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన మంచువారబ్బాయి!

హీరో మంచి మనోజ్ కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ హీరో మనోజ్ తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో…Read more

7.చిదంబరానికి చిరు ఊరట

56 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. బెయిల్ దొరికిందనుకుంటున్నారా ? అయితే మీరు పొరబడినట్లే. అయితే సిబిఐ లేకపోతే ఈడీ.. ఇలా మార్చి…Read more

8.రాజ్యాంగ సంక్షోభం కూడా రావొచ్చు: ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో త్యాగాలు…Read more

9.సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి.. ఆ సంస్థ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. అందుకు తగ్గట్టుగానే సత్య నాదెళ్లకు…Read more

10.దాదా చేతిలో… ధోనీ భవితవ్యం…?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది…Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu