Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!

Telangana Governor Tamilsai asks Minister Ajay on RTC strike, బ్రేకింగ్:  ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా!

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 నుంచి సాగుతున్న సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులను రవాణా కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్‌కు వివరించారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో మంత్రి పువ్వాడ అజయ్.. గవర్నర్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ భేటీ అయ్యారు. రేపు( శుక్రవారం) ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే అక్టోబర్ 5న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని, సమ్మెకు దిగిన 48 వేలమంది కార్మికులు తమ ఉద్యోగులు కాదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ మహేశ్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం మరో కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. ఇప్పటికే సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం హైకోర్టు ఇరు వర్గాలకు మొట్టికాయలు వేసింది. సమ్మెలతో ప్రజలను ఇబ్బంది పెట్టవందంటూ కార్మిక సంఘాలకు చెబుతూనే.. చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. దీంతో శుక్రవారం కోర్టు వాయిదా ఉన్నందున ప్రభుత్వం తన వాదన వినిపించేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే గవర్నర్ తమిళసై రెండు రోజుల క్రితం ఉన్నపాటుగా ఢిల్లీ పయనమై రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఒక నివేదిక అందించారు.

Related Tags