Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ముంచుకొస్తున్న మాంద్యం… ఆర్థిక వ్యవస్థ కుదేలు!

Why Modi government Responsible for the Economic slowdown in India, ముంచుకొస్తున్న మాంద్యం… ఆర్థిక వ్యవస్థ కుదేలు!

దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కమ్మేస్తున్నది. 2019వ సంవత్సరం ప్రారంభం నుండి వివిధ రంగాలకు సంబంధించి ఉత్పత్తి తగ్గటంపై వెల్లడౌతున్న అంశాలను జులై నెలకు విడుదల చేసిన అంకెలు స్థిరపరిచాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తగ్గింది. కార్ల పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో నెలకొన్న పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలలోకి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతుంది.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. అమెరికా కూడా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. యూరప్ లో ఎన్నో పేరెన్నిక గల సంస్థలు మూతబడ్డాయి. అయితే ఇండియా మాత్రం అప్పుడు కూడా ఠీవీగా కనిపించింది. భారత మార్కెట్లు ఉరకలెత్తాయి. దేశీయ పరిశ్రమ అప్పుడు దేశాన్ని నిలబెట్టింది. అమెరికా లాంటి దేశాలే ఇబ్బందులు పడినా ఇండియా మాత్రం అప్పుడు మాంద్యం ప్రభావానికి లోను కాలేదు!

ఇక ఇప్పుడు  మోడీ జమానా. మొన్నేమో బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి భారత దేశానికన్నా చాలా బాగుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఇండియా కన్నా బంగ్లాదేశ్ ముందుకు దూసుకపోతోందని తేల్చాయి. తాజాగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా కన్నా  శ్రీలంక – పాకిస్తాన్ వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల్లో పిల్లలకు మనదేశంలో  కన్నా మంచి ఆహారం అందుతూ ఉంది. వారిలో పెరుగుదల స్థాయి బాగుంది.

ఆఖరికి టూరిజం మీద ఆధారపడి బతికే శ్రీలంక వంటి దేశం కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంలోకి పడటం లేదు. మన దేశంలో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతూ ఉంది. ఇప్పటికే కార్ల అమ్మకాలు చాలా వరకూ ఆగిపోయాయని ఆ సంస్థలు ప్రకటించాయి. ఒక్క ఏడాదిలోనే లక్షకు పైగా కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో కార్ల కంపెనీలు నష్టాల్లోకి పోయే పరిస్థితి వచ్చింది.

ఇక నోట్ల రద్దు అప్పుడు పడిపోయిన చిన్నాచితక పరిశ్రమలు మళ్లీ కోలుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మోడీ ప్రభుత్వం నోట్లతో ప్రయోగాలు చేస్తూ ఉంది. ఆర్థిక మంత్రేమో మన్మోహన్ ను – కాంగ్రెస్ వాళ్లను విమర్శించే పనిలో ఉన్నారు. మూడు వంద కోట్ల రూపాయల సినిమాలు వచ్చాయి.. ఆర్థిక వ్యవస్థకు అంతకన్నా ఇంకేం కావాలన్నట్టుగా ఒక కేంద్రమంత్రి మాట్లాడారు. ఇదీ మోడీ జమానాలో జరుగుతున్నది. మాంద్యం ప్రభావం సామాన్యులపై పూర్తి స్థాయిలో పడితే పరిస్థితులు తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.

మాంద్యాన్ని నివారించాలన్నా, ప్రపంచాన్ని కమ్ముకుంటున్న సంక్షోభం నుండి మనం తక్కువ నష్టంతో బయట పడాలన్నా నయా ఉదారవాద సంస్కరణలను పక్కన పెట్టి, ప్రజలకు ఉపాధిని, ఉద్యోగాలను కల్పించే విధానాలను అమలు జరపాలి. అపుడు మాత్రమే మాంద్యాన్ని అధిగమించటంతో పాటు సంక్షోభం నుండి కూడా తక్కువ నష్టంతో బయటపడగలం.

Related Tags