పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు!

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవాదుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు సమాచారం. దీంతో హోంమంత్రిత్వ శాఖ అఫ్గన్‌ ఉగ్రవాదుల సమాచారం ఇవ్వాలని […]

  • Publish Date - 8:20 pm, Thu, 17 October 19 Edited By:
పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు!

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవాదుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు సమాచారం. దీంతో హోంమంత్రిత్వ శాఖ అఫ్గన్‌ ఉగ్రవాదుల సమాచారం ఇవ్వాలని భద్రతా దళాలను కోరింది. ఫోన్‌ సదుపాయాలను పునరుద్దరణను ఐఎస్‌ఐ అవకాశంగా తీసుకునే ప్రమాదాలు ఉన్నట్లు భద్రతా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మాత్రం కశ్మీరీ స్థానికులపై దారుణాలు ఆపడం లేదు. షోపియాన్‌ జిల్లాలో ఇద్దరు పండ్ల వ్యాపారులను బలితీసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌, పాక్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో పాక్‌ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత దళాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి.

పాక్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్‌ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరు దీపావళి రోజున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని గురువారం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల మధ్య టెలిఫోన్‌ సంభాషణను గుర్తించిన నిఘా అధికారులు, ఉగ్ర కుట్ర చాలా పెద్దదని తేల్చారు. భారత్‌లోకి చొరబడ్డాక తమ మనుషులను ఢిల్లీలో కలుసుకొనేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సైనికాధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.