AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఏంటీ భయ్యా.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే హీరోయిన్ అయిపోయింది.. 20 ఏళ్ల పెద్ద హీరోతో రొమాన్స్..

సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన తారలు ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా సక్సెస్ అయ్యారు. కొందరు చదువుల కోసం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో బాలనటిగా అలరించిన ఓ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. తనకంటే 20 ఏళ్లు పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా చేసిన ఫస్ట్ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది.

Tollywood : ఏంటీ భయ్యా.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే హీరోయిన్ అయిపోయింది.. 20 ఏళ్ల పెద్ద హీరోతో రొమాన్స్..
Sara Arjun
Rajitha Chanti
|

Updated on: Dec 04, 2025 | 8:48 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించిన తొలి చిత్రం అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తనకంటే 20 ఏళ్లు పెద్ద హీరోతో ఆమె ఫస్ట్ మూవీ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే బేబీ సారా అర్జున్. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. దీంతో తన సోషల్ మీడియా ఖాతాలలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది సారా. ముంబైలో జన్మించిన సారా.. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తుంది. 2011లో విడుదలైన ‘404’ చిత్రంతో బాలనటిగా హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

అదే ఏడాది విక్రమ్ చియాన్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో విక్రమ్ కూతురిగా కనిపించింది. క్లైమాక్స్ లో సారా, విక్రమ్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సారా విస్తృత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 2013లో ఆమె ‘చిత్తిరై నిలచ్ చోరు’ చిత్రంలో నటించింది. తరువాత, ఆమె హిందీ చిత్రం ‘జై హో’లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించిన సారా.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

2022లో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ టీనేజ్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సరసన ధురందర్ అనే సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుుంటుంది. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 20 సంవత్సరాలు కాగా.. రణవీర్ వయసు 40 ఏళ్లు. ఇప్పుడిప్పుడే నెట్టింట యాక్టివ్ అవుతుంది సారా అర్జున్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjunn)

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

Follow Us
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ప్రీమియం విల్లాస్‌కు కేరాఫ్‌ అడ్రస్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్
ప్రీమియం విల్లాస్‌కు కేరాఫ్‌ అడ్రస్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్
చికెన్ బోన్స్ తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..
చికెన్ బోన్స్ తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..