Tollywood : ఏం ఛేంజ్ భయ్యా.. ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. డాక్టర్ కమ్ యాక్టర్..
సాధారణంగా సినీరంగంలో డాక్టర్ కమ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మెడికల్ విద్యను మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఉన్నారు. అలాగే అటు వైద్యులుగా సేవలు అందిస్తూ.. మరోవైపు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్లుగా దూసుకుపోతున్న తారలు ఉన్నారు. అందులో ఈ అమ్మాయి ఒకరు.

పైన ఫోటోలో ట్రెడిషనల్ చుడిదార్లో బొద్దుగా.. చూడముచ్చటగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఆమె పక్కా తెలంగాణ అమ్మాయి..ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. హైదరాబాద్ లో చదువుకుని.. ఆ తర్వాత చైనాలో ఎంబీబీఎస్ చేసింది. అక్కడే ఒక ఆసుపత్రిలో డాక్టర్ గా కొన్నాళ్లు పనిచేసింది. ఆ తర్వాత మళ్లీ మన దేశానికి తిరిగి వచ్చి అపోలో ఆసుపత్రిలో దాదాపు ఆరేళ్లు వర్క్ చేసింది. కానీ నచ్చిన ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నప్పటి నుంచి నటనపై ఏర్పడిన ఆసక్తితో ఇటు సినీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మిస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిచింది. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. చిన్న చిన్న సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ.. ఇప్పుడు హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ స్టన్నింగ్ ఫోటోస్ చేస్తూ షాకిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదు.. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల.
2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కామాక్షి.. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్, మా ఊరి పొలిమేర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. పొలిమేర సినిమాతో టాలీవుడ్ లో చాలా పాపులర్ అయ్యింది. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు వెబ్ సిరీస్ లలోనూ సందడి చేసింది. ఝాన్సీ, ధూత, సైతాన్ వంటి సిరీస్ చేసి మరింత ఫేమస్ అయ్యింది.
ఒకప్పుడు కామాక్షి భాస్కర్ల ఎంతో బొద్దుగా ఉండేది. కానీ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత బరువు తగ్గి సన్నజాజీ తీగల మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కామాక్షి భాస్కర్ల. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. అలాగే ఏంజెల్ హౌస్, వాయిస్ 4 గర్ల్స్, మేక్ ఎ డిఫరెన్స్ వంటి NGOలలో పనిచేస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..