- Telugu News Photo Gallery Cinema photos Ritu Varma latest stunning looks in saree goes viral in internet
Ritu Varma: ఈ సుకుమారిలో ఐస్కాంతం దాగి ఉంది.. కుర్రాళ్లను ఇట్టే లాగేస్తుంది.. స్టన్నింగ్ రీతు..
తెలుగు, తమిళ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రీతు వర్మ. షార్ట్ ఫిల్మ్‌లుతో నటనలో కెరీర్ మొదలు పెట్టింది. మొదట సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈమె.. తన అద్భుతమైన నటనతో కథానాయకిగా ఎదిగింది. ఈ వయ్యారి పక్క తెలుగమ్మాయి. ఈ నటనకి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ఆమె నటనకి అవార్డ్స్ కూడా అందుకుంది. ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..
Updated on: Mar 23, 2025 | 7:07 PM

10 మార్చి 1990న తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో జన్మించింది రీతు వర్మ. ఆమె కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందినది. ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన తెలుగు చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.

ఆమె హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇంటర్మీడియట్ చదివింది. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

తెలుగు షార్ట్ ఫిల్మ్ అనుకోకుండాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ లఘుచిత్రం అవార్డును గెలుచుకుంది. ఇందులో రీతూ వర్మ నటనకి ఉత్తమ మహిళ నటి అవార్డు కూడా లబించింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌లో ప్రదర్శించబడింది.

ఆమె మొదటి చిత్రం బాద్షా, ఇందులో ఆమె పింకీ అనే సహాయక పాత్రను పోషించింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో ఆమె శ్రీ విష్ణు సరసన కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది. ఆ తరువాత నా రాకుమారుడు ఎవడే సుబ్రమణ్యంలో కనిపించింది.

2016 పెళ్లి చూపులు చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు, సౌత్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తర్వత కేశవ, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 2024లో స్వాగ్ అనే సినిమాలో ఆకట్టుకుంది. తాజాగా మజకాతో మరో హిట్ అందుకుంది.





























