Nainisha Rai: చిన్న ఏజ్‌లోనే క్యాస్టింగ్ కౌచ్‌తో ఇబ్బంది పడ్డా.. బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్‌లో ఇన్ని కష్టాలు పడిందా..!
బ్రహ్మముడి లాంటి సీరియల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సీరియల్‌లో నటించిన నటీ నటులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బ్రహ్మముడి సీరియల్ లో న నటించిన అప్పు కు కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ సీరియల్ లో నటించిన అప్పు అసలు పేరు నైనిషా రాయ్.

సీరియల్స్ అంటే.. ఇష్టముండని ఆడవాళ్లు ఉంటారా..? ఇప్పుడు మగాళ్లు కూడా ఈ మధ్య సీరియల్స్ చూస్తున్నారు. సినిమాలకు మించి ట్విస్ట్ లతో సంవత్సరాల కొద్దీ సాగుతుంటాయి. ఇక బ్రహ్మముడి లాంటి సీరియల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సీరియల్‌లో నటించిన నటీ నటులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బ్రహ్మముడి సీరియల్ లో న నటించిన అప్పు కు కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ సీరియల్ లో నటించిన అప్పు అసలు పేరు నైనిషా రాయ్. ఈ చిన్నది బ్రహ్మముడి సీరియల్ లో మగరాయుడిగా కనిపించి అలరిస్తుంది. అయితే ఈ చిన్నదాని నిజజీవితంలో చాలా కష్టాలు అనుభవించిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నైనిషా రాయ్ షాకింగ్ విషయాలు తెలిపారు.
అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను అని తెలిపింది. నైనిషా రాయ్ మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్న సమయంలో తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. సీరియల్స్ పై ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్స్ లో నటించానని కానీ ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా దొరకడం లేదు అని తెలిపింది. అలాగే తన తల్లి దండ్రులకు దూరంగా ఉంటున్నా అని తెలిపింది.
ఫ్యామిలీకి దూరమైన తర్వాత నాలుగేళ్ళ వరకు స్ట్రగుల్స్ పడ్డాను అని తెలిపింది. క్యాస్టింగ్ కోచ్ గురించి స్పందించింది నైనిషా రాయ్. చిన్న ఏజ్‌లోనే క్యాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. మేనేజర్ ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. కానీ నాకు కమిట్మెంట్ అంటే తెలియదు. నాకు తెలిసిన కమిట్మెంట్ అంటే ఏదైనా మనం సాధించాలంటే కష్టపడి చేయాలి.. ఇక్కడ నన్ను కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటుంటే నేను అదేనేమో అనుకోని ఓకే చెప్పాను.. షూటింగ్ రెండు రోజులు ఉందనగా నన్ను ఇబ్బంది పెట్టారు. నేను అప్పుడు వాళ్ళను కొట్టాను. దాంతో నన్ను చాలా ప్రాబ్లమ్స్ కు గురిచేశారు. దాంతో నేను ఆరు ఏడూ నెలలు డిప్రషన్ లోకి వెళ్ళిపోయాను అని తెలిపింది. ఒకదాని తర్వాత ఒకటి ఎదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నేను బయటకు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా అని తెలిపింది. తన బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేశాడు అని తెలిపింది.
నైనిషా రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నైనిషా రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
