Kushboo – Animal: ఆ సినిమా ఎలా హిట్ అయ్యిందో ఇప్పటికి అర్ధం కావడం లేదు: ఖుష్బూ.
ఇండియా నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ Tv9 నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ మెగా ఎన్క్లేవ్ లో భాగమవుతున్నారు. మూడు రోజులు ఈ సమ్మిట్ జరగనుంది. మొదటిరోజు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులను టీవీ9 నెట్ వర్క్ సత్కరించింది. ఈ కార్యక్రమంలోనే సినీ నటి రవీనా టాండన్ను నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించింది టీవీ9.
ఇండియా నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ Tv9 నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ మెగా ఎన్క్లేవ్ లో భాగమవుతున్నారు. మూడు రోజులు ఈ సమ్మిట్ జరగనుంది. మొదటిరోజు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులను టీవీ9 నెట్ వర్క్ సత్కరించింది. ఈ కార్యక్రమంలోనే సినీ నటి రవీనా టాండన్ను నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించింది టీవీ9. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ నటి , జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ.. మరో సారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మెగా ఎన్క్లేవ్ లో పాల్గొన్న సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్… తన తల్లి పట్ల తన తండ్రి వ్యవహరించిన తీరును మరోసారి గుర్తుచేసుకున్నారు. తన తల్లి పరిస్థితి చూసి ఎప్పుడూ నిస్సహాయురాలిగా మారకూడదని అనుకున్నానని.. ఎప్పటికీ ఒక నిస్సహాయ మహిళగా మారకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రతి విషయానికి ఎప్పుడూ తలాడించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమల్ సినిమా విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఖుష్బూ. “యానిమల్ సినిమా విజయం కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ప్రజల ఆలోచనల గురించి మనం ఏమి చెప్పగలం ?.. యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారు. సినీ ప్రేక్షకుల మనస్తత్వమే ఇప్పుడు సమస్య. సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి” అని అన్నారు ఖుష్బూ. ప్రస్తుతం తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..