AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: చాలా బాధగా ఉంది.. ట్రోల్స్ పై స్పందించిన సాయి పల్లవి

సాయి పల్లవి నటించిన విరాటపరం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2022లో ఈ సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి

Sai Pallavi: చాలా బాధగా ఉంది.. ట్రోల్స్ పై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2024 | 12:51 PM

Share

నటి సాయి పల్లవిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ జరుగుతున్నాయి. భారత సైన్యాన్ని అవమానించారనే ఆరోపణ లు చేసిందంటూ నెటిజన్ సాయి పల్లవి పై ఫైర్ అవుతున్నారు.  2022లో సాయి పల్లవికి సంబందించిన ఓ  ఇంటర్వ్యూ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. పాకిస్థాన్‌లో ఉన్నవారు భారత సైనికులను ఉగ్రవాదులుగా చూస్తారు అని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. దాంతో ఆమె పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే..  2022 విరాట పర్వం చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయి.

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

భారత సైన్యం పాకిస్థాన్ ప్రజలను ఉగ్రవాదులుగా చూస్తోందని, పాక్ ప్రజలు కూడా అలాగే చేస్తారని సాయి పల్లవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో, సాయి పల్లవి మాట్లాడుతూ, ఎలాంటి హింస ఎప్పుడూ సరైనది కాదు.. అలాగే అది ఎలాంటి సమస్యలను పరిష్కరించదు అని సాయి పల్లవి అంది. అయితే నక్సల్స్ గురించిన ప్రశ్నకు ఈ సమాధానంలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించి ప్రస్తుతం సాయి పల్లవిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై  సాయి పల్లవి స్పందిస్తూ..  ఏ వర్గాన్ని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని, ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే వైరల్ చేయడం బాధను కలిగించింది అని సాయి పల్లవి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం శివకార్తికేయన్ తో కలిసి అమరన్ అనే సినిమా చేస్తుంది. కాగా ఇప్పుడు అమరన్ సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తూ నెటిజన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అమరన్ తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్. దీని తర్వాత సాయిపల్లవిని రామాయణం నుంచి తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. రామాయణంలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.