ఆమెతో పిల్లల్ని కంటా.. స్టార్ సింగర్ పిచ్చివాగుడు.. మండిపడుతున్న నెటిజన్స్
అతను ఒక స్టార్ సింగర్.. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ నోటి దురుసుతో ఇప్పుడు లేనిపోని వివాదంలో చిక్కుకున్నాడు. ఆ స్టార్ సింగర్ చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు నెటిజన్స్ చేత బండబూతులు తిట్టించుకుంటున్నాడు. ఇంతకూ ఆ స్టార్ సింగర్ ఎవరంటే..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది సామెత.. చాలా మంది సెలబ్రెటీలు నోటి డ్యూ దురుసు కారణంగా లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ సింగర్ కూడా అంతే నోటికొచ్చినట్టు మాట్లాడి అనవసరంగా వార్తల్లో నిలిచాడు. సినీ ఇండస్ట్రీలో హీరోల, హీరోయిన్స్ మాత్రమే కాదు సింగర్స్ కూడా చాలా పాపులర్. ఎంతో మంది సింగర్స్ హీరో, హీరోయిన్స్ కు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వారిలో ఈ రాప్ సింగర్ ఒకడు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి పాపులర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఓ వివాదంలోనూ చిక్కుకున్నాడు. ఓ మహిళా సింగర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆయన.. ఇంతకూ ఆ పెద్ద మనిషి ఎవరంటే..
ర్యాప్ సింగర్ బాద్షా.. ఈ పేరు తెలుగు పేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈయన చాలా ఫెమస్. అక్కడ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఆయన. సింగర్ బాద్షా పలు టీవీషోల్లో జడ్జ్ గాను వ్యవహరిస్తున్నారు. కాగా ఈ స్టార్ సింగర్ ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ దువా లిపా పై ఆయన చేసిన కామెట్స్ వివాదంగా మారింది. నెటిజన్స్ సింగర్ బాద్షా పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ మహిళా సింగర్ ను అలా అంటావా అంటూ మండిపడుతున్నారు.
ఇంతకూ అతను ఏమన్నాడంటే ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ దువా లిపా.. ఆమెతో పాట పాడటం కాదు కానీ పిల్లలను కంటా అని అతను పేర్కొనడం వివాదానికి దారితీసింది. బాద్షా సోషల్ మీడియాలో దువా లిపా అని రాశాడు. దానికి ఓ అభిమాని “భాయ్.. మీరు ఆమెతో కలిసి ఓ ట్రాక్ చేస్తున్నారా?” అని అడిగాడు. దానికి బాద్షా రెస్పాండ్ అవుతూ.. “నేను ఆమెతో పిల్లల్ని కనడానికి ఇష్టపడతాను బ్రో” అని రాసుకొచ్చాడు. దీని పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బాద్షా పై ఓ రేంజ్ లో తిట్ల దండకం మొదలు పెట్టారు.
View this post on Instagram
సింగర్ బాద్షా ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




